: గూగుల్ సాయంతో గూటికి చేరిన యువతి !


ఊహ తెలియని వయసులో తప్పిపోయిన ఓ అమ్మాయిని 17 ఏళ్ల తరువాత ఓ అధికారిణి సహాయంతో 'గూగుల్' వాళ్ల కుటుంబానికి దగ్గర చేసింది. బీహార్ రాజధాని పాట్నాకు చెందిన ఆరేళ్ల గుడియా మేనమామతో తాతగారింటికి బయల్దేరింది. బీహార్ లోని బరౌనీ రైల్వేస్టేషనులో తినుబండారాలు కొనేందుకు గుడియా మేనమామ దిగాడు. ఇంతలో ట్రైన్ కదిలిపోయింది. అతను రైలును మళ్లీ అందుకోలేకపోయాడు. గౌహతీలో దిగిన గుడియాను రైల్వే పోలీసులు గమనించి అడ్రస్ అడిగితే తన అడ్రస్ కానీ, కుటుంబ సభ్యుల వివరాలు చెప్పలేకపోయింది. పాట్నాలోని తన ఇంటి ఎదురుగా ఉన్న బిస్కట్ ఫ్యాక్టరీలో మేనమామ పనిచేస్తాడని మాత్రమే చెప్పింది. ఆ చిన్న జ్ఞాపకంతో పోలీసులకు ఆమె అడ్రస్ కనుక్కోవడం కష్టమైంది. దీంతో చిల్డ్రన్ హోంలో చేర్చారు. ఆక్కడే పెరిగి పెద్దదయింది. పెళ్లి కూడా చేసుకుంది. తప్పిపోయినప్పుడు ఆమెకు హిందీ మాత్రమే తెలుసు. పెద్దయ్యాక అస్సామీ మాత్రమే వచ్చు. హిందీ మర్చిపోయింది. భర్తను తీసుకుని తల్లిదండ్రులను వెదికేందుకు గుడియా పాట్నా చేరింది. 17 ఏళ్లలో మార్పులు చోటుచేసుకోవడంతో తల్లిదండ్రుల జాడ కనుక్కోలేకపోయింది. దీంతో అసోం పిల్లల సంరక్షణలో పనిచేసే నీలాక్షి శర్మ అనే అధికారిణి గూగుల్ లో బిస్కెట్ ఫ్యాక్టరీల అడ్రస్ లు వెతికి గుడియాకు చెప్పింది. దాని ఆధారంగా వెతికిన గుడియా తన తల్లిదండ్రులను చేరుకుంది.

  • Loading...

More Telugu News