: కార్తీ, నేను కలిసి చేయాలని ఎదురు చూస్తున్నాం: సూర్య
విశాఖలో ‘సికిందర్’ ఆడియో సక్సెస్ మీట్ లో పాల్గొన్న సూర్య మాట్లాడుతూ, 1997లో జ్యోతికను చూశానని అన్నారు. తరువాత తామిద్దరం కలిసి నటించిన 'నువ్వు నేను ప్రేమ' సినిమాతో ప్రేమలో పడ్డానని సూర్య వెల్లడించారు. గౌరవ మర్యాదలు, ఆర్థిక భద్రత కల్పించిన సమాజానికి, అభిమానులకు ఏదైనా చెయ్యాలనే ఉద్దేశంతోనే తాను 'అగరం' ఫౌండేషన్ మొదలుపెట్టానని సూర్య తెలిపారు. 'సికిందర్' సినిమా ఆలోచన తన తమ్ముడు కార్తీదని ప్రముఖ హీరో సూర్య తెలిపారు. తన తమ్ముడితో కలిసి నటించాలని తనకు ఉందని, తొందర్లోనే తన కోరిక నెరవేరుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. విశాఖపట్టణం వచ్చినప్పుడు తాను గతంలోకి వెళ్లానని, విశాఖ చాలా బాగుంటుందని సూర్య తెలిపారు.