: గల్లంతు అయిన ఆ జవాను ... పాక్ కస్టడీలో ఉన్నాడు
జమ్మూ కాశ్మీర్ లోని చీనాబ్ నదిలో ఇవాళ ఉదయం పడవలో ఐదుగురు జవాన్లు ప్రయాణిస్తుండగా ప్రమాదం జరిగింది. నలుగురు జవాన్లు సురక్షితంగా బయటపడగా, సత్యశీల్ యాదవ్ అనే జవాను గల్లంతయ్యాడు. అయితే, గల్లంతైన ఆ జవాను పాకిస్థాన్ కస్టడీలో ఉన్నట్లు తెలుస్తోంది. చీనాబ్ నది ప్రవాహ వేగం వల్ల ఆ జవాను పాకిస్థాన్ వైపు కొట్టుకుపోయి సైన్యానికి చిక్కినట్టు తెలుస్తోంది. జవానును అప్పగించాల్సిందిగా భారత అధికారులు పాక్ అధికారులను కోరారు.