: ఆ ఫొటో షూట్ తో నిండా తిట్టించుకున్న ఫ్యాషన్ ఫొటోగ్రాఫర్
ఫ్యాషన్ వెర్రితలలు వేస్తోంది... దానికి క్రియేటివిటీ అనే పేరు పెడతారు మన సినీ జనాలు. ఏదయినా చేసి జనాల మీదికి వదిలేయవచ్చనే అభిప్రాయంతో కొత్త కొత్త పేర్లు పెట్టి తమ విద్వత్తు ప్రదర్శిస్తూ విమర్శలపాలవుతారు. తాజాగా ఇలాంటి ఘటనే సోషల్ మీడియాలో వీక్షకుల ఆగ్రహానికి గురైంది. రాజ్ షెట్టి అనే ఫ్యాషన్ ఫొటోగ్రాఫర్ 'ద రాంగ్ టర్న్' పేరిట ఓ ఫొటో షూట్ చేశారు. ఆ ఫొటో షూట్ నిర్భయ ఘటనను అందరికీ గుర్తు చేసింది. ఓ మహిళ బస్సులో ఇద్దరు పురుషులతో పోరాడుతున్నట్టు ఉండగా, ఒకడు ఆమె కాళ్లపై పడి ఒడిసి పట్టుకున్నట్టు ఉండగా, రెండో వ్యక్తి ఆమె వ్యక్తిగత భాగాలను తడుముతున్నట్టు ఉండడంతో నెటిజన్లు ఫోటోగ్రాఫర్ పై మండిపడుతున్నారు. కొందరైతే తిట్ల దండకం అందుకున్నారు. దీంతో ఆ పేజ్ ని డిలీట్ చేశారు. తాను నిర్భయ ఘటన ఆధారంగా ఫొటో షూట్ చేయలేదని, ఇది తన క్రియేటివిటీ అని ఫోటో గ్రాఫర్ చెప్పడం విశేషం.