: రేపు విజయవాడలో 13 జిల్లాల కలెక్టర్లతో చంద్రబాబు సమీక్ష


రేపు (గురువారం) విజయవాడలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు 13 జిల్లాల కలెక్టర్లతో సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఈ సమావేశం కొనసాగనుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న 7 మిషన్లపై ప్రధానంగా చర్చ జరుగుతుందని సమాచారం. అనంతరం రాత్రి 8 గంటలకు 13 జిల్లాల ఎస్పీలతో చంద్రబాబు సమావేశం కానున్నారు. ఈ సమీక్షా సమావేశానికి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లను చేస్తున్నారు. వెయ్యి మంది పోలీసులతో భద్రత కల్పిస్తున్నారు. రేపు ఉదయం 8 గంటల నుంచి మహాత్మాగాంధీ రోడ్డు వైపు ట్రాఫిక్ ను మళ్లిస్తున్నారు. ఈ సమావేశంలో పాల్గొనేందుకు ఇప్పటికే పలువురు జిల్లా కలెక్టర్లు, మంత్రులు విజయవాడకు చేరుకున్నారు.

  • Loading...

More Telugu News