: కొనసాగుతున్న డేల్ స్టెయిన్ దూకుడు
శ్రీలంకతో చివరి టెస్టులోనూ దక్షిణాఫ్రికా పేసర్ డేల్ స్టెయిన్ నిప్పులు చెరిగాడు. కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ వేదికగా నేడు ఆరంభమైన ఈ టెస్టులో స్టెయిన్ ధాటికి శ్రీలంక ఆరంభంలోనే రెండు వికెట్లు చేజార్చుకుంది. ఓపెనర్ తరంగ 11 పరుగులు చేసి వెనుతిరగ్గా, స్టార్ బ్యాట్స్ మన్ కుమార సంగక్కర డకౌట్ అయ్యాడు. దీంతో, ఆతిథ్య జట్టు 16 పరుగులకే 2 వికెట్లు కోల్పోగా... మహేల జయవర్థనే (34*), కౌశల్ సిల్వా (31*) ఆదుకున్నారు. ప్రస్తుతం తొలి సెషన్లో ఆ జట్టు 2 వికెట్లకు 91 పరుగులతో ఆడుతోంది.