: కృష్ణాజిల్లా చాట్రాయిలో ఆర్టీసీ బస్సు బోల్తా
కృష్ణాజిల్లా చాట్రాయిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 10 మంది ప్రయాణికులు గాయపడ్డారు. చీపురుగూడెం నుంచి నూజివీడు వెళ్తుండగా ఆర్టీసీ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.