: రోజూ ఓ ఆస్పిరిన్ మాత్రతో క్యాన్సర్ దరిచేరదట!


ఆస్పిరిన్ మాత్ర ఉపయోగాలపై ఓ కొత్త అధ్యయనం వెలుగులోకి వచ్చింది. ఈ మాత్రను రోజూ తీసుకోవడం ద్వారా పలు రకాల క్యాన్సర్ ల నుంచి రక్షణ కలుగుతుందని బ్రిటన్ పరిశోధకులు అంటున్నారు. 50-65 మధ్య వయస్కులు ప్రతి రోజూ ఆస్పిరిన్ తీసుకున్నట్టయితే యూకేలో ప్రతి ఏడాది 6000 మంది ప్రాణాలు సురక్షితంగా ఉంటాయని అధ్యయనం చెబుతోంది. ఈ అద్భుత మాత్ర క్యాన్సర్ నుంచే కాకుండా, హార్ట్ అటాక్, స్ట్రోక్ వంటి ఉత్పాతాల నుంచి రక్షణ కల్పిస్తుందట. ముఖ్యంగా ఇది బొవెల్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్, ఐసోఫేగస్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుందని పరిశోధకులు అంటున్నారు. అయితే, ఈ మాత్ర వినియోగం పట్ల ఓసారి జనరల్ ఫిజీషియన్ సలహా తీసుకుంటే మేలని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన జాక్ క్యుజిక్ హెచ్చరిస్తున్నారు.

  • Loading...

More Telugu News