: రుణమాఫీపై బాబువి బీద అరుపులు: చెవిరెడ్డి


రైతు రుణమాఫీపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడువి బీద అరుపులని వైఎస్సార్సీపీ నేత చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఎద్దేవా చేశారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, బాబు ఆస్తులు తనఖా పెడితే రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ, పెన్షన్లు అన్నీ అమలు చేయవచ్చని అన్నారు. గతంలో బాబు అధికారం చేపట్టి ప్రభుత్వ సంస్థలను దివాళా తీయించి, మూయించారని, ప్రైవేట్ సంస్థలు మాత్రమే బాగుపడ్డాయని ఆయన ఆరోపించారు. చంద్రబాబు పాత విధానాలు విడనాడి రైతులకు మేలు చేయాలని ఆయన సూచించారు. చిత్తూరు డైరీని మూయించేసి హెరిటేజ్ డైరీని లాభాల బాటలో నడుపుతున్నారని ఆయన విమర్శించారు.

  • Loading...

More Telugu News