: కరిష్మా మళ్లీ పెళ్లి చేసుకోదు: కరీనా కపూర్


భర్త నుంచి విడిపోయిన బాలీవుడ్ నటి కరిష్మా కపూర్ గత కొంతకాలంగా పిల్లలతో కలసి విడిగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో త్వరలో ఆమె వ్యాపారవేత్త సందీప్ తోష్నివాల్ ను పెళ్లి చేసుకోబోతుందంటూ వార్తలు వచ్చాయి. దీనిపై కరిష్మా సోదరి, నటి కరీనా కపూర్ స్పందించింది. కలసి ఉండి ఎప్పుడూ ఘర్షణ పడేకన్నా... విడిగా ఉంటూ ప్రశాంతంగా ఉండటమే మంచిదని చెప్పింది. ఈ క్రమంలోనే కరిష్మా మళ్లీ పెళ్లి చేసుకోదని కరీనా స్పష్టం చేసింది. ప్రస్తుతానికి కరిష్మాకు విడాకులు రాలేదని, ఆమెకిది బాధాకరమైన సమయమని కరీనా పేర్కొన్నట్లు ముంబయి స్థానిక పత్రిక వెల్లడించింది.

  • Loading...

More Telugu News