: ముద్దుల్లో నాకు పోటీ లేదు... వారి ముద్దుల్లో ఫీల్ లేదు: ఇమ్రాన్ హష్మీ
ముద్దుల్లో తనకు పోటీ లేదని బాలీవుడ్ సీరియల్ కిస్సర్ ఇమ్రాన్ హష్మీ అభిప్రాయపడ్డాడు. ముంబైలో ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ముద్దు సీన్లలో తన 1000 గంటల అనుభవం ముందు కుర్రకారు తేలిపోతున్నారని అన్నాడు. తెరపై యువహీరోలు పెట్టుకునే ముద్దుల్లో పెద్దగా ఫీల్ ఉండడం లేదని ఇమ్రాన్ హష్మీ తెలిపాడు. యువ హీరోలు ఒక్క ముద్దుతోనే సరిపెట్టేస్తున్నారని అన్నాడు. ఇమ్రాన్ హష్మీ మర్డర్, ఆషిక్ బనాయా ఆప్నే, జహార్, వో లమ్హే సినిమాలను ముద్దులతో హిట్ చేశాడు.