: అక్కను పొడిచేసి... పోలీసులకు ఫోన్ చేశాడు


ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. తెల్లవారుజామున దక్షిణ ఢిల్లీలోని ఆర్కే పురం పోలీసు స్టేషనుకు మొహిందర్ (27) అనే యువకుడు ఫోన్ చేసి, తన అక్క జ్యోతి (30)ని కత్తితో పొడిచి చంపేశానని తెలిపాడు. దీంతో ఆర్కే పురం సెక్టార్ 3 వద్దకు వెళ్లిన పోలీసులకు గాయాలతో ఉన్న మొహిందర్ కనిపించాడు. దీంతో అతడిని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పూర్తయిన తరువాత అతడిని అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు. కాగా, మొహిందర్ నిరుద్యోగి కావడంతో, జ్యోతితో ఆస్తి విషయంలో గొడవపడి ఉంటాడని, అందుకే అక్కను పొడిచి చంపి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.

  • Loading...

More Telugu News