: తోటి ప్రయాణికుడి కోసం రైలునే పైకెత్తారు!


ఆస్ట్రేలియాలో ఓ విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. పెర్త్ రైల్వే స్టేషన్లో ట్రైన్ ఎక్కే క్రమంలో ఓ ప్రయాణికుడి కాలు కంపార్ట్ మెంట్ కు, ప్లాట్ ఫాంకు మధ్య ఇరుక్కుపోయింది. రైలు కదిలితే అతని ప్రాణాలు అపాయంలో పడతాయి. దీంతో, అందరిలోనూ ఆందోళన బయల్దేరింది. బోగీకి, ప్లాట్ ఫాంకు మధ్య ఉన్న ఐదు సెంటిమీటర్ల గ్యాప్ లో అతడి కాలు చిక్కుకుంది. అతడి కాలును బయటికి లాగే ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో తోటి ప్రయాణికులు అందరూ కలిసి ఓ పట్టుబట్టి రైలును కాసింత పైకి లేపారు. దీంతో, ఆ అభాగ్యుడు ఊపిరి పీల్చుకున్నాడు. అతడికి ప్రథమ చికిత్స చేసి మరో రైలులో గమ్యస్థానానికి పంపారు. ప్రయాణికుల సంకల్పాన్ని ఆస్ట్రేలియా రైల్వే వర్గాలు కొనియాడుతూ, 'ప్రజల శక్తి'కి ఇది నిదర్శనమని పేర్కొన్నాయి. ఇలాంటి ఘటన చూడడం ఇదే ప్రథమమని ట్రాన్స్ పెర్త్ రైల్వే ప్రతినిధి క్లెయిర్ క్రోల్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News