: క్రీడాకారులను ప్రోత్సహిస్తాం: కేటీఆర్
కామన్వెల్త్ విజేతలు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ని కలిశారు. స్వర్ణ పతక విజేత పారుపల్లి కశ్యప్ కి రూ.50 లక్షల నజరానా ప్రకటించారు. అలాగే రజత పతక విజేతలకు రూ.25 లక్షలను అందించనున్నారు. కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొని పతకాలు సాధించిన క్రీడాకారులను ప్రోత్సహిస్తామని రాష్ట్ర మంత్రి కేటీఆర్ అన్నారు. క్రీడాకారులకు శిక్షణనిచ్చిన కోచ్ లకు నజరానా ప్రకటిస్తామని ఆయన అన్నారు. ఆగస్టు 15న కామన్వెల్త్ విజేతలకు బహుమతి ప్రదానం చేయనున్నట్లు కేటీఆర్ చెప్పారు. తెలంగాణ ప్రభుత్వ ప్రోత్సాహంపై బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ హర్షం వ్యక్తం చేశారు.