: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఎన్సీపీ కలిసే పోటీ చేస్తాయి: శరద్ పవార్


మహారాష్ట్ర అసెంబ్లీకి త్వరలో జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్, ఎన్సీపీ కలిసే పోటీ చేస్తాయని ఆ పార్టీ అధినేత శరద్ పవార్ వెల్లడించారు. ఈ మేరకు సీట్ల సర్దుబాటుపై ఢిల్లీలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని కలసి చర్చించిన అనంతరం పవార్ ఈ ప్రకటన చేశారు. ఇదిలావుంటే కొన్నిరోజుల కిందట 2014 లోక్ సభ ఎన్నికల్లో తమ పార్టీ మెరుగైన పనితీరు కనబర్చిన నేపథ్యంలో సీట్ల కోటా పెంచాలని ఎన్సీపీ నేత మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ డిమాండ్ చేశారట. మొత్తం 288 సీట్లున్న మహారాష్ట్రలో ఎన్సీపీకి 144 సీట్లు కేటాయించాలని పార్టీ నేత, ఇది అన్యాయమని స్థానిక కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News