: అమెరికా 'ప్లే బోయ్' ఆధ్వర్యంలో హైదరాబాదులో పబ్


ప్లే బోయ్ మేగజైన్ గురించి తెలియని పురుషపుంగవులు ఉండరంటే అతిశయోక్తి కాదు. అంత చరిత్ర ఉంది ప్లేబోయ్ మేగజైన్ కు.. మోడల్స్ కు మంచి వేతనం చూపి నగ్నంగా ఫోటోలు తీసి సొమ్ము చేసుకోవడమే ప్లేబోయ్ పని. అశ్లీలానికి మారుపేరుగా నిలిచే ప్లేబోయ్ గ్రూప్ హైదరాబాదులో పబ్ ఏర్పాటు చేయనుంది. గోవా, ఢిల్లీ, ముంబైలలో క్లబ్బులు, పబ్ లు ఏర్పాటుకు అనుమతి కోరుతూ 2012లో దరఖాస్తు చేసుకుంది ప్లేబోయ్ గ్రూప్. అశ్లీలానికి తావులేకుండా పబ్ లను నిర్వహిస్తామని ప్రభుత్వానికి హామీ కూడా ఇచ్చింది. అయినా ఏ ప్రభుత్వమూ అనుమతినివ్వలేదు. దీంతో సన్ షైన్ రిసార్ట్స్ పేరుతో గోవాలో ఓ రిసార్ట్ ను ఏర్పాటు చేసింది. తాజాగా హైదరాబాద్ లో పబ్ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది ప్లేబోయ్. కాగా, ప్లేబోయ్ పబ్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేయడంతో నగర శివార్లలోని ఓ ప్రముఖ హోటల్ లో లాంఛనంగా ప్రారంభోత్సవం చేయనున్నారు. ఈ ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు సిటీలోని బిగ్ షాట్స్ పోటీ పడుతున్నారట. ఇందులో పలువురు ఉన్నతాధికారులు కూడా ఉండడం విశేషం. ప్లేబోయా మజాకా...!

  • Loading...

More Telugu News