: ఓంపురికి నీరాజనం పలికిన న్యూయార్క్ మ్యూజియం


భారతదేశం గర్వించదగ్గ నటుల్లో ఓంపురి (63) ఒకరు. జాతీయస్థాయిలో ఆయన అందుకున్న అవార్డులు ఆ విషయాన్ని ఘనంగా చాటుతాయి. అంతటి మహానటుడికి న్యూయార్క్ మ్యూజియం నీరాజనం పలికింది. ఆయనపై ఓ ఏవీ (ఆడియో విజువల్) ని రూపొందించి ప్రదర్శనకు పెట్టింది. ఈ అమెరికా మ్యూజియం కేవలం సినిమా, టెలివిజన్, డిజిటల్ మీడియా రంగాల కోసమే ఏర్పాటైంది. ఈ ఏవీని ఆవిష్కరించకముందు ఆయన తాజాగా నటించిన 'ద హండ్రెడ్ ఫుట్ జర్నీ' సినిమా ప్రీవ్యూ ప్రదర్శించారు. ఈ హాలీవుడ్ సినిమాలో ఓంపురి ఆస్కార్ విజేత హెలెన్ మిరెన్ సరసన నటించారు.

  • Loading...

More Telugu News