: ప్రమాద ఘటనతో ఆ మూడు గ్రామాల్లో విషాదం
మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద స్కూలు బస్సును రైలు ఢీకొన్న ఘటన నేపథ్యంలో ఇస్లాంపూర్, వెంకటాపల్లి, గూనేపల్లి గ్రామాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘటనలో మరణించిన విద్యార్థులు ఈ మూడు గ్రామాలకు చెందినవారే కావడంతో ఇక్కడ రోదనలు మిన్నంటాయి. కాకతీయ విద్యామందిర్ స్కూలుకు చెందిన బస్సు ఇస్లాంపూర్ నుంచి విద్యార్థులను తీసుకువస్తుండగా ఈ దారుణం జరిగింది. హైదరాబాద్ వస్తున్న నాందేడ్ ప్యాసింజర్ కాపలాలేని లెవల్ క్రాసింగ్ వద్ద ఈ బస్సును ఢీకొట్టింది.