: పంచెకట్టుకు చట్టపరమైన రక్షణ... బిల్లు తెచ్చిన తమిళనాడు ప్రభుత్వం


తమిళనాడులో సంప్రదాయ వస్త్రధారణ పంచెకట్టును పరిరక్షించేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు పంచెకట్టుకు చట్టబద్ధత కల్పిస్తూ ఈరోజు (బుధవారం) రాష్ట్ర అసెంబ్లీలో ముఖ్యమంత్రి జయలలిత బిల్లును ప్రవేశపెట్టారు. రిక్రియేషన్ క్లబ్బులు, అసోసియేషన్లు, ట్రస్టులు, కంపెనీలు, సొసైటీల్లో ఎవరైనా పంచె ధరించవచ్చని, దీనిపై ఎవరూ ఆంక్షలు విధించకూడదని అందులో పేర్కొంది. అంతేగాక, ఈ చట్టాన్ని క్లబ్బులు, సంస్థలు అతిక్రమిస్తే లైసెన్సులు రద్దు చేయాలని కూడా ఈ బిల్లు ప్రతిపాదించింది. ఒకవేళ ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే సంవత్సరం పాటు జైలుశిక్ష, రూ.25వేల జరిమానా విధిస్తారు. గత నెలలో మద్రాస్ హైకోర్టు జడ్జి జస్టిస్ డి.హరిపరంథామన్, మరో ఇద్దరు న్యాయవాదులను చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఉన్న తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ క్లబ్ లోనికి అనుమతించలేదు. ఇందుకు కారణం, వారు పంచె ధరించడమే. దాంతో, ఈ విషయం కాస్తా వివాదంగా మారి, ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకునేందుకు మూలమైంది. ఈ నేపథ్యంలో సీఎం జయలలిత ఇప్పుడు పంచెకట్టుకు చట్టబద్ధత కల్పిస్తున్నారు.

  • Loading...

More Telugu News