: బీసీసీఐకి షాకిచ్చిన ఐసీసీ


ఆండర్సన్, జడేజా వివాదంపై ఐసీసీ నిర్ణయం బీసీసీఐకి శరాఘాతంలా తాకింది. ఈ గొడవపై విచారణ జరిపిన గోర్డాన్ లూయిస్ జ్యుడీషియల్ కమిటీ ఎవరిదీ తప్పులేదంటూ మధ్యస్థంగా తీర్పు ఇచ్చింది. దీనిపై టీమిండియా కెప్టెన్ ధోనీతో పాటు బీసీసీఐ వర్గాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి. లూయిస్ కమిటీ తీర్పుపై ఐసీసీ తిరిగి అప్పీల్ చేయాలని బీసీసీఐ కోరింది. అయితే, భారత క్రికెట్ బోర్డు విన్నపాన్ని ఐసీసీ తోసిపుచ్చింది. లూయిస్ కమిటీ తీర్పు తమకు సంతృప్తికరంగానే ఉందని ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవ్ రిచర్డ్సన్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News