: తొలిసారిగా సమావేశమైన గోదావరి నది యాజమాన్య బోర్డు


గోదావరి నది యాజమాన్య బోర్డు తొలి సమావేశం ముగిసింది. ఈ సమావేశానికి బోర్డు ఛైర్మన్ మహేంద్రన్, సభ్య కార్యదర్శి చంద్రశేఖర్ అయ్యర్ తో పాటు ఆంద్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నీటి పారుదల శాఖ కార్యదర్శులు, విద్యుత్ శాఖాధికారులు హాజరయ్యారు. గోదావరి జలాలకు సంబంధించిన విధివిధానాలపై సమీక్షించారు. గోదావరిపై రెండు రాష్ట్రాల్లో నిర్మిస్తున్న ప్రాజెక్టులపై, ప్రస్తుతం అమలులో ఉన్న ప్రాజెక్టులపై చర్చించారు. ఎగువ, దిగువ సీలేరు విద్యుదుత్పత్తి మానిటరింగ్ కమిటీపై కూడా చర్చ జరిగింది. ప్రత్యేకంగా కార్యనిర్వాహక వ్యవస్థ ఏర్పాటు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఇకపై తరచూ గోదావరి నది యాజమాన్య బోర్డు సమావేశమవ్వాలని నిర్ణయించారు.

  • Loading...

More Telugu News