: విజయనగరం నుంచొచ్చిన కేసీఆర్ స్థానికుడా?...మరెవ్వరూ కాదా?: ఆనం
స్థానికత వివాదాస్పద అంశంపై కాంగ్రెస్ నేత ఆనం వివేకానందరెడ్డి తనదైన శైలిలో విమర్శలు చేశారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, కేసీఆర్ కు భారత చట్టాలంటే గౌరవం లేదని అన్నారు. స్థానికతను విద్య, ఉద్యోగాల్లో అడుగుతారని, ప్రాధమిక విద్య ఏడేళ్లు ఎక్కడ సాగితే దానిని స్ధానికతగా నిర్ధారిస్తారని ఆయన చెప్పారు. విజయనగరం జిల్లా నుంచి వలస వచ్చిన కేసీఆర్ స్థానికుడా? ఇక్కడే పుట్టిన ప్రజలు స్ధానికులు కాదా? అని ఆయన ప్రశ్నించారు. స్థానికతకు 1956 ప్రాతిపదిక అయితే లక్షలాది కుటుంబాలకు అన్యాయం జరుగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాను, తన సోదరుడు తుదిశ్వాస ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతామని ఆనం స్పష్టం చేశారు. తాము పార్టీ మారే అలోచనలో లేమని ఆయన తెలిపారు.