: చైనాను వణికించిన భూకంపం... 600 మంది మృతి
చైనాలో గత ఆదివారం సంభవించిన భూకంపంలో 600 మంది మరణించారు. ఒక్క లుడియం కౌంటీలోనే 500 మందికి పైగా మరణించినట్లు తెలుస్తోంది. కూలిన భవనాల శిథిలాలను తొలగించే కార్యక్రమం కొనసాగుతోంది. కొండచరియలు విరిగిపడి నదీప్రవాహానికి అడ్డుకట్ట వేశాయి. దీంతో అక్కడక్కడా కృత్రిమ నీటి సరస్సులు ఏర్పాడ్డాయి. వీటి కారణంగా వరదలు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.