: ఏపీలో 8 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ
ఎనిమిది మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడ పోలీస్ కమిషనర్ గా ఎ.బి.వెంకటేశ్వరరావు, ఎస్పీఎఫ్ డీజీగా ఫైర్ సర్వీస్ డీజీ సాంబశివరావుకు పూర్తి బాధ్యతలు అప్పగించారు. రాష్ట్ర ఇంటిలిజెన్స్ బ్యూరో డీఐజీగా డి.శ్రీనివాసులు, ఇంటిలిజెన్స్ డీఐజీగా టి.యోగానంద్, ఏలూరు రేంజ్ డీఐజీగా పి.హరికుమార్, విశాఖ డీసీపీగా సీఎం త్రివిక్రమ వర్మ, సీఐడీ ఎస్పీగా ఎం.శ్రీనివాసులు నియమితులయ్యారు.