: కాంగ్రెస్ అంతర్గత తిరుగుబాటును ఎదుర్కొంటోంది: అరుణ్ జైట్లీ


లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారంటూ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించడంపై కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ మండిపడ్డారు. ప్రస్తుతం పార్టీలోనే కాంగ్రెస్ అంతర్గత తిరుగుబాటును ఎదుర్కొంటోందని, అందులోకి స్పీకర్ ను లాగొద్దనీ అన్నారు. ఈ విషయంలో సభను కానీ, సభాపతిని గానీ లాగాల్సిన అవసరం లేదని ఆయన సూచించారు. ‘మీరేదో చేసేస్తున్నట్టుగా చూపించుకోవాలనుకుంటే, మీ పార్టీకి నాయకత్వం వహించుకోండి’ అని రాహుల్ ని ఉద్దేశించి మంత్రి అన్నారు. అయితే, కాంగ్రెస్ ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన సరైన సమయం ఇదేనని జైట్లీ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News