: విజయవాడ నగర పాలక సమావేశం రసాభాస
విజయవాడ నగరపాలక సమావేశం రసాభాసగా మారింది. డ్వాక్రా రుణాల మాఫీపై చర్చ జరుగుతుండగా టీడీపీ, వైఎస్సార్సీపీ కార్పొరేటర్ల మధ్య వాగ్వాదం జరిగింది. వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు మేయర్ పోడియం వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. దాంతో సమావేశాన్ని మధ్యాహ్నం 3 గంటలకు వాయిదా వేశారు.