: శాంసంగ్, ఆపిల్ రాజీపడ్డాయి!
పేటెంట్ హక్కులపై ఇన్నాళ్ళూ కుమ్ములాడుకున్న దిగ్గజ సంస్థలు శాంసంగ్, ఆపిల్ రాజీకొచ్చాయి. అమెరికా వెలుపలి కోర్టుల్లో పరస్పరం దాఖలు చేసుకున్న దావాలను ఉపసంహరించుకోవాలని ఈ రెండు సంస్థలు నిర్ణయించాయి. అయితే, అమెరికా న్యాయస్థానాల పరిధిలో ఉన్న కేసులను మాత్రం కొనసాగించనున్నట్టు శాంసంగ్ తెలిపింది. మొబైల్ ఫోన్ డిజైన్లు, టెక్నాలజీ విషయమై శాంసంగ్, ఆపిల్ నడుమ గత కొన్నేళ్ళుగా న్యాయపోరాటం నడుస్తున్న విషయం తెలిసిందే