: హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసిన కేబీఆర్ వాకర్స్ అసోసియేషన్
హైదరాబాదులోని కాసు బ్రహ్మానందరెడ్డి (కేబీఆర్) పార్కు వాకర్స్ అసోసియేషన్ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. పార్క్ లో వాకర్స్ నుంచి అధికంగా రుసుమును వసూలు చేస్తున్నారని, రుసుమును 800 నుంచి 1500కు పెంచారని వారు పిటీషన్ లో పేర్కొన్నారు. ఏ ఇతర పార్కులోనూ ఉదయపు నడక కోసం వచ్చే వారి నుంచి రుసుమును వసూలు చేయడం లేదని వారు కోర్టుకు విన్నవించారు. రుసుమును రద్దు చేయాలని వారు ఈ పిటీషన్ లో కోరారు.