: చంద్రబాబుపై కేసీఆర్ వివాదాస్పద వ్యాఖ్యలు


ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్య చేసి వార్తల్లో నిలిచే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. దమ్ముంటే అభివృద్ధిలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తమతో పోటీ పడాలని సవాల్ విసిరారు. ప్రొఫెసర్ జయశంకర్ జయంతి ఉత్సవాల సందర్భంగా ప్రసంగించిన ఆయన... ఈ వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా, హైదరాబాదులోని సంస్థలకు తెలంగాణ వారి పేర్లే పెడతామని స్పష్టం చేశారు. తమకు అవసరం లేని విగ్రహాలు, పేర్లు తమకెందుకని ప్రశ్నించారు. తెలంగాణలోని విద్యాలయాల్లో ఆంధ్ర విద్యార్థులకు చట్ట ప్రకారం 15 శాతం అడ్మిషన్లు ఇస్తామని కేసీఆర్ తెలిపారు. తమ పిల్లల ఫీజులు తాము కట్టుకుంటామని... ఆంధ్ర విద్యార్థుల ఫీజులు ఆ ప్రభుత్వమే కట్టుకోవాలని అన్నారు. తెలంగాణలో కూడా గ్రీన్ హౌస్ ను ప్రోత్సహిస్తామని... గ్రీన్ హౌస్ కు ఇచ్చే విద్యుత్ పై అదనపు చార్జీలను రద్దు చేస్తామని అన్నారు.

  • Loading...

More Telugu News