: తల్లిదండ్రుల మాంసాన్ని వండి, లంచ్ బాక్సుల్లో ప్యాక్ చేశాడు!


అంధులైన తల్లిదండ్రులకు ఉత్తమగతులు అందించేందుకు వారిని కావడిలో మోసుకుని పుణ్యక్షేత్రాలకు తీసుకువెళ్ళిన శ్రవణుడి గురించి మనం చదువుకున్నాం. కానీ, హాంకాంగ్ లో అందుకు పూర్తి విరుద్ధంగా ప్రవర్తించాడో కిరాతక కొడుకు. తల్లిదండ్రులు వృద్ధులని కూడా చూడకుండా అత్యంత కిరాతకంగా హతమార్చి, వారి మాంసాన్ని వండి, లంచ్ బాక్సుల్లో ప్యాక్ చేశాడు. హాంకాంగ్ లో నివసించే చౌ వింగ్ కి (65), సు యెట్ యీ (62) దంపతులకు హెన్రీ చౌ (30) ఒక్కడే కుమారుడు. హెన్రీ ఓ రోజు స్నేహితుడు ట్సే చున్ కీతో కలిసి తల్లిదండ్రులను హతమార్చాడు. వారి మాంసాన్ని ముక్కలుగా కోసి, వండి, అన్నంతో కలిపి లంచ్ బాక్సుల్లో సర్దాడు. వాటిని ఫ్రిజ్ లో పెట్టాడు. ఫ్రిజ్ లో స్థలం లేకపోవడంతో మిగిలిన మాంసాన్ని చెత్తకుండీలో వేశాడు. అనంతరం తల్లిదండ్రులు కనిపించడంలేదంటూ ఫిర్యాదు చేశాడు. పోలీసులకు హెన్రీపై అనుమానం రావడంతో అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో దారుణం వెలుగులోకి వచ్చింది. విచారణలో పొంతనలేని సమాధానాలు చెప్పాడీ దుర్మార్గుడు. తొలుత తన తల్లిదండ్రులు చైనా వెళ్ళారని బుకాయించాడు. అనంతరం నేరాన్ని అంగీకరించాడు. తాను తల్లిదండ్రులను చంపినట్టు ఓ ఇంటర్ నెట్ మెసేజింగ్ గ్రూపు పేజీలోనూ పేర్కొన్నాడు. ఇతగాడు తనను తాను ఓ సైకోపాత్ అని భావించేవాడట. ప్రస్తుతం ఈ కేసులో కోర్టు విచారణ జరుగుతోంది. ఉద్రేకంలో తాను వారిద్దరినీ చంపానని హెన్రీ చెబుతుండగా... అవి పథకం ప్రకారం జరిగిన హత్యలని పోలీసులు అంటున్నారు. హత్యకు ఉపయోగించిన కత్తులు, మాంసం నిల్వచేయడానికి వాడిన రిఫ్రిజిరేటర్లు, ఆ మాంసాన్ని వండేందుకు ఉపయోగించిన మైక్రోవేవ్ ఓవెన్లు ముందుగానే కొనుగోలు చేశారని పోలీసులు కోర్టుకు తెలిపారు.

  • Loading...

More Telugu News