: ప్రముఖ కార్టూనిస్ట్ ప్రాణ్ శర్మ కన్నుమూత
ప్రముఖ కార్టూనిస్ట్ ప్రాణ్ శర్మ(74) గుర్గావ్ ఆసుపత్రిలో క్యాన్సర్ వ్యాధితో ఈ ఉదయం మృతి చెందారు. అవిభాజ్య భారతదేశంలోని పాకిస్తాన్ లో జన్మించిన ఆయన పంజాబ్ యూనివర్శిటీ నుంచి పొలిటికల్ సైన్స్ లో మాస్టర్స్ డిగ్రీ పుచ్చుకున్నారు. ప్రపంచ ఎన్ సైక్లోపీడియా కామిక్స్ లో భారత వాల్ట్ డిస్నీగా పేరొందిన ప్రాణ్ కు కార్టూన్లు గీయడంలో ఆర్ కే లక్ష్మణ్, సుధీర్ దార్ లే హీరోలు అని చెబుతారు. ఆయన సృష్టించిన చాచా చౌదరి, శ్రిమట్జి, పింకి, బిల్లూ, రామన్, చన్నీ చాచి ఇతర పాత్రలు ఎంతో పేరు తెచ్చాయి. ఇందులో చాచా చౌదరి పాత్ర ఎంతో పాప్యులర్ అయింది. 2001లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్టూనిస్ట్స్ లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డు, ఈ ఏడాదిన 'వాల్ట్ డిస్నీ ఆఫ్ ఇండియా' పేరుతో 'వరల్డ్ ఎన్ సైక్లోపీడియా ఆఫ్ కామిక్స్' ఆయనను సత్కరించాయి. కాగా, తన కార్టూన్స్ అన్నీ భారతీయ మధ్య తరగతి ప్రజల జీవితం నుంచి స్పూర్తితో రూపొందినవేనని ఓ సందర్భంలో ప్రాణ్ చెప్పారు. అందుకే రీడర్లకు అవి చాలా దగ్గరగా ఉంటాయని పేర్కొన్నారు.