: ఆ కాస్సేపు 'బిగ్ బెన్' క్లాక్ ఆగిపోతుంది.. ఎందుకనగా..


న్యూయార్క్ అంటే స్టాట్యూ ఆఫ్ లిబర్టీ.. పారిస్ అంటే ఈఫిల్ టవర్.. ఆగ్రా అంటే తాజ్ మహల్.. ఇలా కొన్ని ప్రపంచ నగరాలకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. లండన్ కూడా ఆ కోవలోకే వస్తుంది. అక్కడ ఉన్న 'బిగ్ బెన్' గడియారం ఈ ఖరీదైన నగరానికి నిలువెత్తు శోభను చేకూర్చుతుంది. లండన్ వెళ్ళే పర్యాటకులు బిగ్ బెన్ ను దర్శించకుండా రారంటే అతిశయోక్తికాదు.

అలాంటి ప్రాశస్త్యమున్న ఈ విశిష్ట నిర్మాణం బుధవారం కొద్దిసేపు మౌనం దాల్చనుంది. ఎందుకంటారా, కొద్దిరోజుల క్రితం తుదిశ్వాస విడిచిన బ్రిటీష్ మాజీ ప్రధాని మార్గరెట్ థాచర్ భౌతిక కాయానికి రేపు అంత్యక్రియలు జరగనున్నాయి. ఆ క్రతువు పూర్తయ్యేవరకు 'బిగ్ బెన్' గడియారాన్ని నిలిపివేసి ఆమెకు మరణానంతర గౌరవం అందించాలని ప్రస్తుత ప్రభుత్వం భావిస్తోందట.

  • Loading...

More Telugu News