: వైకాపాకు షాక్... టీడీపీలో చేరనున్న నెల్లూరు మేయర్


ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్సీపీకి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన మరో కీలక నేత సైకిలెక్కేందుకు రెడీ అయ్యారు. అత్యంత ఉత్కంఠభరిత పరిస్థితుల మధ్య నెల్లూరు మేయర్ గా గెలుపొందిన అజీజ్ వైకాపాకు గుడ్ బై చెప్పనున్నారు. త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి టీడీపీ తీర్థం పుచ్చుకుంటానని స్పష్టం చేశారు. జిల్లాలోని వైకాపా ఎమ్మెల్యేల ప్రవర్తన వల్లే తాను ఈ నిర్ణయానికి వచ్చానని మేయర్ అజీజ్ తెలిపారు. వైకాపా కార్పొరేటర్లు తనను కలవకుండా జిల్లాలోని వైకాపా ఎమ్మెల్యేలు శాసిస్తున్నారని ఆయన ఆరోపించారు. నెల్లూరు అభివృద్ధి కోసమే తాను టీడీపీలో చేరుతున్నానని వెల్లడించారు. తనతోపాటే మరికొంత మంది కార్పొరేటర్లు కూడా తెలుగుదేశం పార్టీలో చేరుతారని చెప్పారు. ఈనెల 10 లేదా 11 తేదీల్లో చంద్రబాబును అజీజ్ కలుస్తారని విశ్వసనీయ వర్గాల సమాచారం.

  • Loading...

More Telugu News