: కుక్కల కోసం కోటి రూపాయలతో విమానం ఏర్పాటు చేసిన పాప్ క్వీన్
కొందరికి విమాన ప్రయాణం ఓ జీవితకాల స్వప్నం. కానీ, పాప్ క్వీన్ మరియా కారీ పెంపుడు శునకాలు అడక్కుండానే విమానం ఎక్కే చాన్సు కొట్టేశాయి. న్యూయార్క్ లో నివాసముండే ఈ అమ్మడు బ్రిటన్ విహారయాత్రకు వెళ్ళాలని నిర్ణయించుకుంది. తన ఎనిమిది పెంపుడు కుక్కలనూ ఆ జాలీ ట్రిప్ కు తీసుకెళ్ళాలని నిశ్చయించుకుంది. మామూలు విమానాల్లో వాటి ఆలనాపాలనకు కష్టమవుతుందని భావించిన మరియా వాటి కోసం ఓ ప్రైవేట్ జెట్ ను ఏర్పాటు చేసింది. అందుకైన ఖర్చు కోటి రూపాయల పైనే. నైరుతి ఇంగ్లండ్ లోని బ్రిస్టల్ నగరంలో పెంపుడు శునకాల కోసం ఓ ప్రత్యేక లగ్జరీ హోటల్ ఉందట. దాని పేరు పాస్ సీజన్స్. అక్కడ కుక్కలకు సకల సౌకర్యాలు కల్పిస్తారని విన్న మరియా అక్కడికే వెళ్ళాలని నిశ్చయించుకుంది. మరియా ఇక్కడ బస చేసినన్నాళ్ళూ కస్టమ్ మెనూలు, ప్రతి కుక్కకూ ఓ బెడ్ ఏర్పాటు చేయనున్నారట.