: జయశంకర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన కేసీఆర్
తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని టీఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించారు. హైదరాబాద్ రాజేంద్రనగర్ లోని ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వద్ద ఏర్పాటు చేసిన జయశంకర్ విగ్రహానికి ఆయన పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ యూనివర్శిటీ పేరును ఆచార్య జయశంకర్ వర్శిటీగా తెలంగాణ ప్రభుత్వం మార్చిన సంగతి తెలిసిందే.