: పెళ్ళికి నిరాకరించిందని నగ్నఫొటోలు ఫేస్ బుక్ లో పెట్టాడు!
అరాచకాలకు కేరాఫ్ అడ్రస్ ఉత్తరప్రదేశ్ లో మరో ఉదంతం. ఓ అమ్మాయి తనతో పెళ్ళికి నిరాకరించిందన్న కారణంతో ఆమె నగ్న ఫొటోలను ఓ కానిస్టేబుల్ ఫేస్ బుక్ లోకి అప్ లోడ్ చేశాడు. రాంపూర్ లో జరిగిందీ దారుణం. బాధితురాలు మైనర్ బాలిక కావడం గమనార్హం. సదరు పోలీసు ఆమె కుటుంబంతో సన్నిహితంగా మెలుగుతూ పలుమార్లు పెళ్ళి ప్రస్తావన తెచ్చాడు. అయితే, ఆ బాలిక కుటుంబ సభ్యులు అతడి కోరికను తిరస్కరించారు. ఇది మనసులో పెట్టుకుని ఆ దుష్ట పోలీసు బాలిక నగ్న ఫొటోలను ఫేస్ బుక్ లో పెట్టాడు. దీంతో, ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కానిస్టేబుల్ తో పాటు అతని ముగ్గురు స్నేహితులపైనా ఐటీ చట్టం కింద కేసు నమోదు చేశారు. క్రైమ్ బ్రాంచ్ కు చెందిన సైబర్ వింగ్ ఈ కేసులో దర్యాప్తు ప్రారంభించింది.