: ఎంసెట్ కౌన్సెలింగ్ పై ఉన్నత విద్యామండలి సమావేశం ప్రారంభం
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ఎంసెట్ కౌన్సెలింగ్ పై ఉన్నత విద్యామండలి సమావేశం ప్రారంభమైంది. ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఛైర్మన్ వేణుగోపాల్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో ఏపీ విద్యాశాఖ కార్యదర్శి అజయ్ జైన్, తెలంగాణ విద్యాశాఖ కార్యదర్శి వికాస్ రాజ్ పలువురు అధికారులు పాల్గొన్నారు. సుప్రీంకోర్టు ఇప్పటికే ఇచ్చిన ఆదేశాలతో రేపటి నుంచి రెండు రాష్ట్రాల్లో కౌన్సెలింగ్ ప్రారంభంకానుంది. ఈ క్రమంలో ధ్రువపత్రాల పరిశీలన, తెలంగాణ ప్రభుత్వ సహకారంపై చర్చిస్తున్నారు.