: విడుదలకు ముందే చేతన్ భగత్ 'హాఫ్ గర్ల్ ఫ్రెండ్' నవలకు విపరీతమైన క్రేజ్


పాప్యులర్ నవలా రచయిత చేతన్ భగత్ తన కలం నుండి జాలువారబోతున్న కొత్త పుస్తకాన్ని ప్రకటించాడు. ఈ పుస్తకం పేరు హాఫ్ గర్ల్ ప్రెండ్. ఈ ఏడాది అక్టోబర్ లో ఈ పుస్తకాన్ని విడుదల చేయనున్నట్లు చేతన భగత్ ప్రకటించాడు. విడుదలకు ముందే హాఫ్ గర్ల్ ఫ్రెండ్ సంచలనం సృష్టిస్తోంది. తన పుస్తకం గురించి పాఠకులకు ఓ ఫీలర్ ఇవ్వడానికి చేతన్ ఈ పుస్తకం మొదటి అధ్యాయాన్ని తన వెబ్ సైట్ లో పోస్ట్ చేశాడు. అయితే, వెబ్ సైట్ కు విపరీతమైన ట్రాఫిక్ పెరిగిపోయి కొన్ని గంటల్లోనే క్రాష్ అయ్యింది. దాంతో, మొదటి అధ్యాయం లింక్ ను ఫేస్ బుక్ అకౌంట్ లో పోస్ట్ చేశాడు. దీనికి కూడా విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే ఈ పుస్తకాన్ని ముందస్తుగా బుక్ చేసుకునే సౌకర్యాన్ని ఈ-కామర్స్ వెబ్ సైట్ ఫ్లిప్ కార్ట్ కల్పించింది. ముందస్తు ఆర్డర్లు ప్రారంభించగానే ఫ్లిప్ కార్ట్ కు భారీ సంఖ్యలో ఆర్డర్లు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఈ పుస్తకం గురించి చేతన్ భగత్ సోషల్ మీడియాలో ప్రకటించగానే... నెటిజన్లు దీనిపై విపరీతంగా స్పందించారు. నిన్న ట్విట్టర్ లో మోస్ట్ ట్రెండింగ్ టాఫిక్ గా హాఫ్ గర్ల్ ప్రెండ్ పుస్తకం నిలిచింది. హాఫ్ గర్ల్ ప్రెండ్ ద్వారా మరోసారి ఓ సరికొత్త ప్రేమకథను మన ముందుకు తీసుకువస్తున్నాడు చేతన భగత్. ఇంగ్లిష్ సరిగ్గా మాట్లాడటం రాని ఓ యువకుడి కథే హాఫ్ గర్ల్ ప్రెండ్. దేశంలో ఇప్పుడు ఇంగ్లిష్ భాషకు సంబంధించిన అంశాలను ఈ పుస్తకం ద్వారా చేతన్ వెలుగులోకి తేనున్నాడు. బీహార్ నుంచి వచ్చిన మాధవ్ అనే మధ్యతరగతి యువకుడు... ఢిల్లీలోని ధనవంతురాలైన రియాను ప్రేమిస్తాడు. ఆ తర్వాత వీరిద్దరి ప్రేమకథ ఎలాంటి మలుపులు తిరిగిందనేదే హాఫ్ గర్ల్ ప్రెండ్ నవల సారాంశం. ఈ పట్టణ- గ్రామీణ ప్రేమకథ... పాఠకుల గుండెను తడమడమే కాకుండా, వారిలో సరికొత్త స్పూర్తిని కూడా నింపుతుందని చేతన్ భగత్ పేర్కొన్నాడు.

  • Loading...

More Telugu News