: టెట్ తిప్పలు ఈ సారీ తప్పవు!
ఉమ్మడి రాష్ట్రంలో ఉండగా, ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ను ఎదుర్కొన్న కాబోయే ఉపాధ్యాయులకు, రాష్ట్ర విభజన అనంతరం కూడా ఆ తిప్పలు తప్పేలా కనిపించడం లేదు. టెట్ రద్దు చేయనున్నట్లు గతంలో ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ సర్కారు తాజాగా మాట మార్చేసింది. ఈ ఏడాదికి టెట్ రాయాల్సిందేనని విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. ఈ ఏడాదికి టెట్ నిర్వహణలో ఎలాంటి మార్పు ఉండబోదన్న మంత్రి, వచ్చే ఏడాది టెట్ ను నిర్వహించాలా? వద్దా? అన్న విషయంపై తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఉపాధ్యాయుల బదిలీల్లో రేషనలైజేషన్ విధానాన్ని పాటించడంతో పాటు... డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయుల ఖాళీలు భర్తీ అయ్యేదాకా విద్యా వాలంటీర్లను కొనసాగించనున్నట్లు చెప్పారు.