: ఇక ప్రియాంకా మేడమ్ రావాలట!
ప్రియాంకాగాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నారట. అంతేకాదండోయ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను ఓడించాలంటే ప్రియాంక, ప్రత్యక్ష బరిలోకి దిగాల్సిందేనని అలహాబాద్ కు చెందిన కాంగ్రెస్ పార్టీ యువజన నేతలు హసీబ్ అహ్మద్, శిరీష్ చంద్ర దూబేలు వాదిస్తున్నారు. వాదనలకే పరిమితం కాని వీరు, అలహాబాద్ లోని ప్రధాన కూడలిలో ఏకంగా బేనర్లనే ఏర్పాటు చేశారు. గతంలోనూ ఈ తరహాలోనే పార్టీ అనుమతి లేకుండా బేనర్లు కట్టిన వీరు, బహిష్కరణకు గురైనా, తిరిగి పార్టీలోకి ఎలాగోలా వచ్చేశారు. అయితే ఈసారి కూడా వీరి చర్యపై పార్టీ అధిష్ఠానం కాస్త కఠినంగా వ్యవహరించే అవకాశాలు లేకపోలేదు. ఎందుకంటే, ఆ బేనర్ లో గతంలో మాదిరిగానే యువరాజు రాహుల్ గాంధీ, ఫొటో కాదు కదా పేరు ప్రస్తావన కూడా లేదు మరి. ఈ బేనర్ పై అటు బీజేపీతో పాటు సొంతపార్టీ కాంగ్రెస్ నుంచి కూడా అహ్మద్, దూబేలు ప్రతిదాడిని ఎదుర్కొంటున్నారు.