: పాలను కల్తీ చేస్తే... ఇకపై యావజ్జీవ కారాగార శిక్షే!
పాలు, ఆహారపదార్థాల కల్తీ విషయంలో మరింత కఠినంగా వ్యవహరించాలని కేంద్రం నిశ్చయించుకుంది. వీటిని కల్తీ చేసేవారిపై మరింత కఠినంగా వ్యవహరించాలని... శిక్షలు, జరిమానాలు అధికంగా విధించాలని నిర్ణయించామని కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ అన్నారు. ఈ మేరకు, ఆహార భద్రత, నాణ్యత చట్టాలకు సవరణలు తీసుకురావాలని కేంద్రం నిర్ణయం తీసుకుందని ఆయన అన్నారు. కల్తీకి పాల్పడుతున్నవారిపై యావజ్జీవశిక్ష కూడా విధించేలా మార్పులు తేవాలని కేంద్రం భావిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.