: పోలీసుల కాల్పుల్లో ఇద్దరు ఎర్రచందనం కూలీలు హతం
కడప జిల్లాలో జరిగిన పోలీసుల కాల్పుల్లో ఎర్రచందనం కూలీలు ఇద్దరు హతమయ్యారు. కడప జిల్లా ఓబులవారిపల్లె మండలం గాదెల అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు ఎర్రచందనం కూలీలు తారసపడ్డారు. వారిని అదుపులోకి తీసుకునేందుకు యత్నించిన పోలీసులపైకి కూలీలు రాళ్లు, గొడ్డళ్లతో దాడికి యత్నించారు. దీంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు కూలీలు హతమయ్యారని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. మరణించిన కూలీలను తమిళనాడుకు చెందినవారిగా గుర్తించారు.