: చిత్తూరు జిల్లాలో పేలుడు పదార్థాల కలకలం
చిత్తూరు జిల్లాలో గురువారం ఉదయం భారీ స్థాయిలో అత్యంత రహస్యంగా దాచిన పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలోని యాదమరి మండలం వరిగపల్లి గ్రామంలో పోలీసులు జరిపిన తనిఖీల్లో భారీ స్థాయిలో నిల్వ ఉంచిన పేలుడు పదార్థాలు బయల్పడ్డాయి. పోలీసులు స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాల్లో 600 జిలెటిన్ స్టిక్స్, 5 బస్తాల నల్లమందు, 70 బస్తాల అమ్మోనియం నైట్రేట్ ఉన్నట్లు సమాచారం. ఈ పేలుడు పదార్థాలను నిబంధనలకు విరుద్ధంగా నిల్వ ఉంచినట్లుగా అనుమానిస్తూ ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.