: 24 గంటల్లో కోస్తాంధ్ర, తెలంగాణల్లో వర్షాలు
జార్ఖండ్, ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్ ల మీదుగా తీవ్ర వాయుగుండం కొనసాగుతోందని వాతావరణ హెచ్చరికల శాఖ తెలిపింది. దీంతో రుతుపవనాలు మరింత చురుగ్గా కదులుతున్నాయని వెల్లడించింది. వాయుగుండం ప్రభావంతో రాగల 24 గంటల్లో కోస్తాంధ్ర, తెలంగాణల్లో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.