: కేసీఆర్ పరిపాలన పిచ్చితుగ్లక్ పాలనలా ఉంది... ఆయన ఓ బ్రేకింగ్ న్యూస్: షబ్బీర్ అలీ


తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత షబ్బీర్ అలీ విరుచుకుపడ్డారు. విద్యుత్ కోతలను నిరసిస్తూ నిజామాబాద్ జిల్లా మాచారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులు రోడ్డుపై బైఠాయించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న షబ్బీర్ అలీ కేసీఆర్ పై ఘాటైన వ్యాఖ్యాలు చేశారు. రెండు నెలల కేసీఆర్ పాలన పిచ్చి తుగ్లక్ పాలనలా ఉందని... రోజుకోరకమైన మాట మాట్లాడుతూ ఆయన పిచ్చితుగ్లక్ ను గుర్తుచేస్తున్నారని షబ్బీర్ అలీ విమర్శించారు. ఛానల్స్ లో ప్రసారమయ్యే బ్రేకింగ్ న్యూస్ గా కేసీఆర్ మారిపోయారని ఆయన ఎద్దేవా చేశారు. విద్యుత్ కష్టాలతో ఆందోళన చేసిన రైతులపై లాఠీచార్జి చేయడం అన్యాయమని షబ్బీర్ అలీ వ్యాఖ్యానించారు. ఆందోళనలో పాల్గొన్న రైతులపై కేసులు పెడితే ఊరుకోబోమని... రైతుల హక్కుల కోసం కాంగ్రెస్ పార్టీ ఉద్యమిస్తుందని ఆయన స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News