: 205 మంది ఐఏఎస్ లు ఆస్తుల వివరాలు ఇవ్వలేదు
కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను సైతం పలువురు ఐఏఎస్ లు బేఖాతరు చేశారు. జనవరి చివరిలోగా ఐఏఎస్ అధికారులంతా తమ ఆస్తుల వివరాలను అందజేయాల్సి ఉంది. అయితే, 205 మంది అధికారులు మాత్రం నిర్దేశిత గడువులోగా వివరాలను సమర్పించలేకపోయారు. వీరిలో ఏపీ క్యాడర్ అధికారులు 26 మంది, యూపీ క్యాడర్ అధికారులు 58 మంది, ఎంపీ క్యాడర్ అధికారులు 28 మంది ఉన్నారు. ఈ వివరాలను కేంద్రం ప్రకటించింది.