: తిరుమలలో అరుదైన 'ఆకుపచ్చ నాగుపాము'
తిరుమల కొండలు అరుదైన ఎన్నో జీవజాతులకు నిలయమన్న సంగతి తెలిసిందే. తాజాగా, నిన్న తిరుమల కొండపై అత్యంత అరుదైన ఆకుపచ్చ రంగు నాగుపాము దర్శనమిచ్చింది. ఇలాంటి నాగుపాము ఇదివరకు ఎన్నడూ కనిపించలేదని అటవీశాఖ అధికారులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సన్నిధానం విశ్రాంతి సముదాయం ఎదుట ఉన్న ఉద్యానవనంలో ఈ పచ్చరంగు నాగుపామును టీటీడీ సిబ్బంది గమనించారు.