: నేడు సమావేశమవుతున్న గోదావరి బోర్డు
గోదావరి నది యాజమాన్య బోర్డు తొలి సమావేశం నేడు హైదరాబాదులో జరగనుంది. కేంద్ర జలసంఘం కార్యాలయంలో ఈ భేటీ జరగబోతోంది. ఈ సమావేశానికి బోర్డు ఛైర్మన్ మహేంద్రన్, సభ్య కార్యదర్శి చంద్రశేఖర్ అయ్యర్, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నీటిపారుదలశాఖల కార్యదర్శులు హాజరవుతారు. వీరితో పాటు ఇరు రాష్ట్రాలకు చెందిన ఇంజినీర్-ఇన్-చీఫ్ లు కూడా సమావేశంలో పాల్గొంటారు. బోర్డు నిర్వహణకు అవసరమైన అధికారులు, మౌలిక సదుపాయాలు, ఆర్థికపరమైన అంశాలపై వీరు చర్చించనున్నారు. ఇరు రాష్ట్రాల్లో గోదావరిపై ఉన్న ప్రాజెక్టులు, నీటి విడుదల, విద్యుత్ ఉత్పత్తి, తదితర అంశాలపైనా చర్చిస్తారు.