: కాపలాలేని రైల్వే క్రాసింగ్ వద్ద బస్సు డ్రైవర్ అజాగ్రత్తే కారణమా?
మెదక్ జిల్లాలోని మాసాయిపేట రైల్వే గేట్ వద్ద ఈ ఉదయం జరిగిన ప్రమాదానికి బస్సు డ్రైవర్ అజాగ్రత్తే కారణమని తెలుస్తోంది. కాపలాలేని రైల్వే క్రాసింగ్ వద్ద ఆగి చూసి వెళ్ళాలన్న విషయాన్ని బస్సు డ్రైవర్ విస్మరించడం చిన్నారుల ప్రాణాలను బలిగొన్నది. అటు, రైల్వే శాఖ నిర్లక్ష్యం కూడా మరోసారి తెరపైకి వచ్చింది. లెవెల్ క్రాసింగ్ ల వద్ద గేట్ మెన్ ను నియమించాలని ఎన్ని డిమాండ్లు వచ్చినా, రైల్వే శాఖలో చలనం రావడంలేదు. ఇలాంటి ప్రమాదాలు గతంలో చాలా జరిగాయి. అయినా, రైల్వే అధికారులు స్పందించకపోవడం దారుణం.