: కేసీఆర్ కు గుడి కట్టిన వర్శిటీ విద్యార్థులు


రాజకీయ నాయకుల మీద అభిమానాన్ని ఒక్కొక్కరూ ఒక్కో విధంగా చాటుకుంటారు. అయితే, హైదరాబాదు శివారు రాజేంద్రనగర్ లోని ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ విద్యార్థులు మాత్రం ఈ విషయంలో కాస్త వైవిధ్యం చూపించారు. వారు ఏకంగా కేసీఆర్ కు గుడినే కట్టి తమ భక్తిని చాటుకున్నారు. అగ్రికల్చర్ వర్శిటీ మెయిన్ గేట్ వద్ద కేసీఆర్ మందిరాన్ని నిర్మించారు. ప్రస్తుతం తాత్కాలికంగా మందిరాన్ని ఏర్పాటు చేశామని, త్వరలో కేసీఆర్ గుడిని శాశ్వతంగా నిర్మిస్తామని విద్యార్థులు తెలిపారు. టీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఈ ఆలయ నిర్మాణం జరిగింది. ఆచార్య ఎన్జీరంగా యూనివర్శిటీలో 6వ తేదీన (బుధవారం) జయశంకర్ జయంతి వేడుకలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా కేసీఆర్ ఇక్కడకు వచ్చే అవకాశం ఉన్నందున విద్యార్థులు తాత్కాలికంగా ఈ ఆలయాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది. శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వెళ్లే దారిలో ఉండటంతో గుడిని కట్టామని, అదే విధంగా గతంలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులు అరెస్టయ్యారని... దీనికి గుర్తుగా కేసీఆర్ ఆలయాన్ని నిర్మించినట్లు విద్యార్థులు చెప్పారు.

  • Loading...

More Telugu News